మొబైల్ ఐడీ యాప్ అప్ డేట్ వర్షన్ ను విడుదల చేసిన కువైట్
- September 20, 2020
కువైట్ సిటీ:పౌర గుర్తింపు కార్డులకు సంబంధించిన 'కువైట్ మొబైల్ ఐడీ' యాప్ ను నవీకరిస్తూ అప్ డేట్ వర్షన్ (V1.5.4) ను లాంచ్ చేసింది ప్రభుత్వం. లేటెస్ట్ అప్ డేట్ వర్షన్ ఐఒఎస్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఐఫోన్ లకు అనుకూలంగా ఉంటుందని కువైట్ పౌర సమాచార ప్రజా అధికార విభాగం వెల్లడించింది. కువైట్ నుంచి ఇతర దేశాలకు రాకపోకలకు సంబంధించి డిజిటల్ సివిల్ ఐడీలను కూడా పరిగణలోకి తీసుకోవాలని కువైట్ ప్రభుత్వం ఇటీవలె నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్ మొబైల్ ఐడీ యాప్ అందరికీ కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో మొబైల్ ఐడీ యాప్ అన్ని డివైజ్ లలో అందుబాటులో ఉండేలా ప్రస్తుత వర్షన్ ను అప్ డేట్ చేసినట్లు పౌర సమాచార ప్రజా అధికార విభాగం వివరించింది.
తాజా వార్తలు
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!







