షార్జా:కోవిడ్ నిబంధనలు పాటించని 2,437 మంది ప్రవాసీయులకు ఫైన్
- September 20, 2020
షార్జా:కోవిడ్ నిబంధనల అమలును పకడ్బందీగా అమలు చేసేందుకు క్షేత్రస్థాయిలో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు షార్జా పోలీసులు. కోవిడ్ పాజిటివ్ వ్యక్తి క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించటంతో అతన్ని అరెస్ట్ చేశారు. అతన్ని మళ్లీ క్వారంటైన్ తరలించి సేఫ్టీ రూల్స్ ఉల్లంఘించకుండా కట్టుదిట్టమైన చర్యలు చపట్టారు. క్వారంటైన్ ఉండాల్సిన వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వాళ్లను అరెస్ట్ చేయటంతో పాటు 50 వేల దిర్హామ్ ల జరిమానా విధిస్తామని పోలీసులు హెచ్చరించారు. కుటుంబ శ్రేయస్సు, సమాజ శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని క్వారంటైన్ లో ఉండాల్సిన ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని పోలీసులు పిలుపునిచ్చారు. ఇదిలాఉంటే...కోవిడ్ నిబంధనల అమలుకు సంబంధించి ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్న షార్జా పోలీసులు...నిబంధనలు పాటించని వారికి అక్కడికక్కడే జరిమానాలు విధిస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు 2,437 మంది ప్రవాసీయులు నిబంధనలు ఉల్లఘించినట్లు గుర్తించామని, 26 రకాల నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం 2,486 ఫైన్లు వేశామని పోలీసులు వెల్లడించారు. నిబంధనల ఉల్లంఘనలో ఎక్కువగా ఫేస్ మాస్కులు ధరించటపోవటం, బౌతిక దూరం పాటించకపోవటం, ఒకే వాహనంలో వేర్వేరు కుటుంబాలకు చెందిన వ్యక్తులు ముగ్గురు కంటే ఎక్కువగా ప్రయాణించటం వంటివి ఎక్కువగా ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..