తెలంగాణ లో కొత్తగా కరోనా 2,137 పాజిటివ్ కేసులు నమోదు
- September 20, 2020
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి యధావిధిగా కొనసాగుతోంది. తాజాగా గత 24 గంటల్లో ఎప్పటిలాగానే 2 వేలకు పైగా కోరనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 2,137 కోవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష 71 వేల 306కు చేరుకుంది.
తెలంగాణలో గత 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా 8 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1033కు చేరుకుంది. కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య రాష్ట్రంలో లక్షా 39 వేల 700కు చేరుకుంది. ఇంకా 30573 యాక్టివ్ కేసులున్నాయి.
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కరోనా వైరస్ నిలకడగానే కొనసాగుతోంది.హైదరాబాదులో గత 24 గంటల్లో 322 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 182 కోవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలో కరోనా ఉధృతి తగ్గినట్లు కనిపిస్తోంది. గత 24 గంటల్లో ఆ జిల్లాలో కేవలం 146 కేసులు మాత్రమే రికార్డయ్యాయి.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







