దుబాయ్ నుంచి స్వదేశానికి 93 మంది ప్రవాస భారతీయులు
- September 20, 2020
చండీగఢ్:కరోనా ప్రభావంతో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టి ‘వందే భారత్ మిషన్’ విజయవంతమవుతోంది. ఇందులో భాగంగా దుబాయ్ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం 96 మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చింది. శనివారం సాయంత్రం 4.13 గంటలకు చండీగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ విమానం చేరుకుంది. వీరిలో చాలా మంది పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, స్వదేశానికి చేరుకున్న ప్రవాసులు ఆయా రాష్ట్రాల క్వారంటైన్ నిబంధనలను పాటించాల్సి ఉంటుందని అధికారలుు తెలియజేశారు. విమానాశ్రయానికి చేరుకున్న 96 మంది ప్రయాణికుల్లో ఏ ఒక్కరిలో కూడా జ్వరం, దగ్గు, జలుబు వంటి అనారోగ్య లక్షణాలు కనిపించలేదని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అలాగే, విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య శాఖ బృందాలు ప్రయాణికులను ఎప్పటికప్పడు అప్రమత్తం చేస్తున్నారు. స్వదేశానికి చేరుకున్నాక, వారు తీసుకోవల్సిన జాగ్రత్తలను సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







