మరో 38 సంస్థల ప్రైవేటైజేషన్ కు అంతా సిద్ధం..సౌదీ నిర్ణయం
- September 20, 2020
సౌదీ: పలు ప్రభుత్వ సంస్థలకు సంబంధించి సౌదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కింగ్డమ్ లోని మరో 38 ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు నిర్ణయించింది. రెండేళ్లలో ప్రైవేటీకరణ ప్రక్రియను పూర్తి చేయనుంది. పర్యావరణం, నీరు, వ్యవసాయం, రవాణా, విద్యుత్, పరిశ్రమలు, మినరల్ వాటర్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సంస్థలతో పాటు హౌసింగ్, విద్య, గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మీడియా, స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సంస్థలు కూడా ఉన్నాయి. ప్రైవేటీకరణకు సంబంధించి విధివిధినాలను ఖరారు చేయనున్నట్లు ఓకజ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఓకజ్ తెలిపిన వివరాల ప్రకారం ప్రైవేటీకరణ ప్రణాళికల పరిధిలో ఉన్న ప్రభుత్వ సంస్థల వివరాలు ఇలా ఉన్నాయి. సెలైన్ వాటర్ కన్వర్షన్ కార్పొరేషన్, ఇరిగేషన్ కార్పొరేషన్, ధాన్యాల సంస్థ, వ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రం, వాతావరణ శాస్త్ర జాతీయ కేంద్రం, వృక్షసంపద అభివృద్ధి, వన్యప్రాణి అభివృద్ధి కేంద్రం, పర్యావరణ నియంత్రణ కేంద్రం, జాతీయ నీటి కంపెనీ, జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, పోర్ట్స్ అథారిటీ, విమానయాన సంస్థ, రైల్వే కార్పొరేషన్, అణు పునరుత్పాదక శక్తి కోసం కింగ్ అబ్దుల్లా సిటీతో మరికొన్ని సంస్థలు ప్రైవేటీకరణ పరిధిలో ఉన్నాయి.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







