షార్జా: 4,100 పార్కింగ్ స్థలాలను పెయిడ్ పార్కింగ్ గా మార్పు

- September 20, 2020 , by Maagulf
షార్జా: 4,100 పార్కింగ్ స్థలాలను పెయిడ్ పార్కింగ్ గా మార్పు

షార్జా: తమ మున్సిపాలిటి పరిధిలోని 4,100 పార్కింగ్ స్థలాలను ఇక నుంచి పెయిడ్ పార్కింగ్ గా మారుస్తున్నట్లు షార్జా మున్సిపాలిటీ తెలిపింది. ఇక నుంచి ఆ 4,100 పార్కింగ్ స్థలాలను వినియోగించుకోవాలంటే డబ్బులు చెల్లించాల్సిందేనని వెల్లడించింది. 3, 10, 15,17వ పారిశ్రామిక ప్రాంతాలలోని పార్కింగ్ స్థలాలతో పాటు..మువీలా వాణిజ్య ప్రాంతం, అల్ తవాన్, అల్ నహద్ లోని పార్కింగ్ జోన్లు పెయిడ్ పార్కింగ్ విధానం అమలులో రానుంది. ఈ సంవత్సరంలో, మునిసిపాలిటీ 230 అదనపు పార్కింగ్ స్థలాలను పెయిడ్ పార్కింగ్‌గా మార్చి... ఆయా పార్కింగ్ స్థలాల్లో టచ్ స్క్రీన్‌తో కూడిన స్మార్ట్ పార్కింగ్ మీటర్లను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసిన విషయం తెలిసిందే. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com