మద్యం తరలిస్తున్న సౌదీ మహిళ ఆమె డ్రైవర్ పట్టివేత
- February 11, 2016
మహిళతో ప్రయాణిస్తే పోలిసుల తనిఖీ నుంచి తప్పుకోవచ్చు అనే వారి అతి తెలివి బెడిసికొట్టింది. రెడ్ హండేడ్ గా 1500 మద్యం సీసాలతో ఒక యజమానురాలు , ఆమె డ్రైవర్ అడ్డంగా దొరికిపోయారు. సౌదీ మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఒక సౌదీ మహిళ బహేరిన్లో ఒక పడవ నుంచి మద్యం సీసాలను తన 4 x 4 కారులోనికి మార్చుకొని కింగ్ ఫహేడ్ కాజ్ వే మార్గంలో వేగంగా ప్రయాణిస్తూ ఆసియా దేశానికి చెందిన తన డ్రైవర్ తో సహా పోలీసులకు పట్టుబడ్డారు. అంతకు మునుపు కస్టమ్స్ యొక్క సాధారణ తనిఖీలో బాగంగా సముద్రంలో ఒక పడవను నిలిపి సోదా జరుపుతున్న సమయంలో స్కానర్లు పడవ అడుగు భాగంలో ఏదో రహస్యంగా దాచబడినట్లు సంకేతం ఇవ్వడంతో క్షుణంగా పరిశీలించిన తనిఖీ అధికారులు పడవకు 8 అడుగుల దిగువ భాగంలో ఒక రహస్య అరలో 1504 మద్యం సీసాలు అక్రమంగా దాచి మరో ప్రాంతంలో డెలివరీకు సిద్ధపడుతున్న సమయంలో కస్టమ్స్ పోలీసులకు చిక్కారు. విచారణలో తమ మద్యం సీసాల సరుకు డెలివరీ వివరాలు సౌదీ మహిళ ఏ విధంగా తమ వద్ద నుంచి తీసుకువెళ్లిందో పడవలోని వారు పూస గుచ్చినట్లు వివరించారు. దీంతో ఆ మహిళా ప్రయాణిస్తున్న కారు రంగు, నెంబర్, మనుష్యుల ఆనవాళ్ళు తదితర వివరాలతో సహా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కింగ్ ఫహేడ్ కాజ్ వే పై వీరి కోసం ఎదురుచూస్తున్న సమయంలో యజమానురాలు , డ్రైవర్ ' మద్య ప్రయాణానికి ' మధ్యలోనే ఫుల్ స్టాప్ పడింది. గత జనవరి మాసాంతంలో బహెరిన్ నుంచి సౌదీకు వస్తున్న ఒక ప్రయాణికుడి నుంచి 430 మద్యం సీసాలు ( 83 లీటర్లు ) పట్టుకొన్న సంగతిని ఈ సందర్భంగా పోలీసులు గుర్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







