అజ్మన్ ప్రభుత్వ ఉద్యోగులు శాశ్వతంగా ఇంటి నుంచే విధుల నిర్వహణ
- September 22, 2020
యూఏఈ:అజ్మన్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించింది స్థానిక ప్రభుత్వం. ఇక నుంచి అజ్మన్ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులు అంతా శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేలా వెసులుబాటు కల్పించింది. అజ్మన్ పరిపాలనా, ఆర్ధిక వ్యవహారాల బాధ్యతలు నిర్వహిస్తున్న రూలర్ షేక్ అహ్మద్ బిన్ హుమెద్ అల్ నుఐమీ స్థానిక ప్రభుత్వ శాఖలన్నింటికి ఆదేశాలు జారీ చేశారు. అయితే..ప్రొబిషన్ మీద విధులు నిర్వహిస్తున్నవారు..అత్యవసర విభాగాలతో పాటు వ్యక్తిగతంగా తప్పకుండా విధులకు హజరు కావాల్సిన అసవరం ఉన్న వారికి మాత్రం విధులకు హజరుకావాల్సిందే. ఇక ఇంటి నుంచి విధులు నిర్వహించే అందించే ప్రభుత్వ ఉద్యోగుల సేవల తీరును బట్టి రెండు రకాలుగా వర్గీకరించారు. కొన్ని విభాగాల ఉద్యోగులు వంద శాతం ఇంటి నుంచే విధులు నిర్వహించవచ్చు. మరికొన్ని విభాగాల ఉద్యోగులు పాక్షికంగానే వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటును కలిపించారు. అయితే..ప్రతి ఉద్యోగి రోజుగానీ, వారంలో ఓ రోజుగానీ లేదంటే నెలలో ఒక రోజుగానీ వారి కార్యాలయాల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగుల అభీష్టం మేరకు వారు ఏదో ఒక విధానాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు అభీష్టం మేరకు విదేశాల్లో ఉండి కూడా వర్చువల్ విధానంలో విధులు నిర్వహించుకునే వెసులుబాుటను కూడా కల్పించారు. కోవిడ్ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా సమర్ధవంతంగా విధులు నిర్వహించిన నేపథ్యంలో...ప్రభుత్వ ఉద్యోగుల పని తీరు మరింత మెరుగు పడేందుకు మరింత అకింత భావంతో విధులు నిర్వహించేలా దోహదం చేసే లక్ష్యంతో ప్రస్తుత వెసులుబాట్లు కల్పించినట్లు ప్రభుత్వ వర్గాలు వివరించాయి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష