తెలంగాణలో కొత్తగా 2,166 కరోనా కేసులు నమోదు
- September 22, 2020
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో 2,166 కొవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1,74,774కు చేరిందని మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. ఇక నిన్న కరోనాతో 10 మంది మృతి చెందినట్లు స్పష్టం చేసింది. దీంతో మృతుల సంఖ్య 1,952కి చేరింది. నిన్న కరోనా నుంచి కోలుకున్న వారు 2,143 మంది. దీంతో కోలుకున్న బాధితుల సంఖ్య 1,44,073 కి చేరింది. వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నవారు 29,649 మంది ఉన్నారు. హోం ఐసోలేషన్లో ఉన్నవారు 22,620 మంది అని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 309 కరోనా కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!
- అమరావతికి చట్టబద్ధత: సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్ఆర్ఐ టీడీపీ సంబరాలు









