జాతీయ దినోత్స వేడుకలకు సిద్ధమైన సౌదీ..హైలెట్ గా నిలవనున్న ఫైర్ వర్క్స్, ఎయిర్ షో

- September 22, 2020 , by Maagulf
జాతీయ దినోత్స వేడుకలకు సిద్ధమైన సౌదీ..హైలెట్ గా నిలవనున్న ఫైర్ వర్క్స్, ఎయిర్ షో

సౌదీ: 90వ జాతీయ దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు సౌదీ అరేబియా సిద్ధమైంది. కళ్లు మెరుమిట్లు గొలిపేలా ప్రముఖ ప్రాంతాల్లో బాణాసంచా కాల్చనున్నారు. అలాగే భారీ ఎయిర్ షోకి ప్లాన్ చేశారు. దాదాపు మిలిటరీ విమానాలతో పాటు సివిల్ ఎయిర్ క్రాఫ్ట్ లు కలిపి మొత్తం 60 విమానాలు అకాశంలో విన్యాసాలు ప్రదర్శించనున్నాయి. ఈ విమానాల విన్యాసాలను సెప్టెంబర్ 23న  సాయంత్రం 4 గంటలకు సౌదీ టీవీ ఛానెల్ లో ప్రసారం చేయనున్నారు. దీంతో సౌదీలోని ముఖ్య నగరాల్లో పలు ఈవెంట్లు కూడా ప్లాన్ చేశారు. రియాద్, జెడ్డా, దమ్మమ్ లో జరగనున్న కార్యక్రమాల్లో అరబ్ స్టార్స్ పాల్గొంటారు. అలాగే దేశ ప్రజల్లో జాతీయత, ఐక్యత భావం పెంచేలా 'పాషన్ టు టాప్'(ఉన్నత శిఖరాలే లక్ష్యం) అనేది జాతీయ దినోత్సవ నినాదమని సౌదీ ఎంటర్టైన్మెంట్ జనరల్ అథారిటీ వెల్లడించింది. అలాగే జాతీయ దినోత్సవం సందర్భంగా 'వి సింగ్ టు అవర్ కంట్రీ' పేరుతో ప్రజలు దేశభక్తిని చాటుకునే ప్రొగ్రామ్ ను ఏర్పాటు చేసింది జీఈఏ. ప్రజలు సౌదీ జాతీయ గీతాన్ని ఆలపించి పంపిస్తే..అందులో జాతీయ స్ఫూర్తిని చాటేలా ఉత్తమంగా ఉన్న వాటిని ఎంపిక చేసి ప్రదర్శిస్తారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com