భారతీయులకు 16 దేశాలు వీసాలు అవసరం లేదు
- September 23, 2020
న్యూ ఢిల్లీ:భారతీయ ప్రయాణికులకు 16 దేశాల నుంచి శుభవార్త వచ్చింది. ఎలాంటి వీసా అనుమతి లేకుండానే తమ దేశం రావచ్చని పేర్కొన్నాయి. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ మంత్రి వి మురళీధరన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ జాబితాలో భూటాన్,నేపాల్,మాల్దీవ్స్, మారిషస్, నియు ద్వీపం,డొమినికా, మోంట్సెరాట్, సెయింట్ విన్సెంట్,సెర్బియా,గ్రెనడిన్స్, సమోవా, సెనెగల్,హైతి,హొంగ్ కాంగ్, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాలు ఉన్నాయి.
వీటితో పాటు సాధారణ వీసా కలిగిన భారతీయులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం కూడా కొన్ని దేశాలు కల్పిస్తున్నాయని తెలిపారు. వీటిలో మయన్మార్, ఇరాన్, ఇండోనేషియా దేశాలు ఉన్నాయి. మలేసియా,శ్రీలంక, న్యూజిలాండ్ దేశాలు ఈ-వీసా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయని తెలిపారు. వీటి సంఖ్యను మరింత పెంచేందుకు కేంద్రం కృషి చేస్తుందని అన్నారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..