RR Vs CSK మ్యాచ్ ను మలుపు తిప్పిన ఆర్చర్‌

- September 23, 2020 , by Maagulf
RR Vs CSK మ్యాచ్ ను మలుపు తిప్పిన ఆర్చర్‌

షార్జా: షార్జా క్రికెట్ స్టేడియం లో మంగళవారం జరిగిన RR,CSK మ్యాచ్ లో ఆర్చర్‌ ఇన్నింగ్స్ 
ఒక హైలెట్ గా నిలిచింది.తొమ్మిదో స్థానంలో వచ్చి అతను కొట్టిన (8 బంతుల్లో ,4 సిక్సర్లతో 27 పరుగులు) మ్యాచ్ స్వరూపాన్ని మార్చింది అని చెప్పాలి. స్మిత్‌ వికెట్ కోల్పోయిన తరువాత రాజస్థాన్‌ స్కోరు 200లోపే ముగుస్తుందని అంతా అనుకున్న తరుణంలో, అనూహ్యంగా ఆఖరి ఓవర్‌లో జోఫ్రా ఆర్చర్ సాధించిన అమూల్యమైన 27 పరుగులు RR ను పటిష్టమైన స్కోర్ కు చేర్చింది.అంతే కాకుండా విలువైన డుప్లెసి వికెట్ పడగొట్టి RR విజయంలో
కీలకపాత్ర పోషించాడు.మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ సంజూ శాంసన్‌ ,స్మిత్‌ ల జోడి అద్భుత ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నారు.

--పవన్ బసిరెడ్డి(మాగల్ఫ్ ప్రతినిధి,హైదరాబాద్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com