ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘బ్యూటీ గర్ల్’
- September 23, 2020
హైదరాబాద్:లక్ష్మీ నారాయణ సినిమా పతాకంపై అల్తాఫ్, అర్చనా గౌతమ్ హీరోహీరోయిన్లుగా.. వేముగంటి దర్శకత్వంలో ప్రముఖ షోలాపూర్ డిస్ట్రిబ్యూటర్ దేవదాస్ నారాయణ నిర్మిస్తోన్న చిత్రం ‘బ్యూటీ గర్ల్’. ఈ చిత్రం ప్రభుత్వ నియమ నిబంధనలు పాటిస్తూ.. షూటింగ్ జరుపుకుని ఫస్ట్ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మీడియాకు చిత్ర విశేషాలను తెలిపింది.
ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత దేవదాస్ నారాయణ మాట్లాడుతూ.. ‘‘షోలాపూర్‌లో నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూటర్‌గా 400కి పైగా పెద్ద సినిమాలు రిలీజ్ చేశాను. ఆ అనుభవంతో ఈ ‘బ్యూటీ గర్ల్’ సినిమాను నిర్మిస్తున్నాను. మా డైరెక్టర్ వేముగారి దర్శకత్వంలో ఈ సినిమా అద్భుతంగా రాబోతుంది. అన్ని కమర్షియల్ అంశాలు ఈ చిత్రంలో ఉండబోతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. షూటింగ్ చేస్తున్నాము. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభిస్తాము. సినిమా బాగా వస్తుంది. ప్రేక్షకులకు కావలసిన ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రంలో పుష్కలంగా ఉంటుంది..’’ అని తెలిపారు.
అల్తాఫ్, అర్చనా గౌతమ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి
బ్యానర్: లక్ష్మీ నారాయణ సినిమా
సంగీతం: ఏలేంద్ర మహావీర్
కెమెరా: మురళీ కృష్ణ. వై
నిర్మాత: దేవదాస్ నారాయణ
దర్శకత్వం: వేముగంటి.
తాజా వార్తలు
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!