కరోనాతో కేంద్ర మంత్రి సురేష్ అంగాడి కన్నుమూత
- September 23, 2020
న్యూ ఢిల్లీ:కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగాడి కన్నుమూశారు. ఈ నెల 11న ఆయనకి కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కరోనా బారిన పడిన ఆయన గత కొద్ది రోజుల నుంచి ఢిల్లీ ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో ఇవాళ చికిత్స పొందుతూ.. ఢిల్లీ ఎయిమ్స్ లో తుది శ్వాస విడిచారు.
సురేష్ అంగడి మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు. కర్ణాటకలోని బెళగావి పార్లమెంట్ నియోజకవర్గం నుండి సురేష్ అంగాడి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన సురేష్ అంగాడి మొన్న ఎన్నికల్లో గెలిచాక మోడీ క్యాబినెట్ లో సహాయ మంత్రి పదవి పొందారు. ఇక కేంద్రంలో మంత్రి హోదాలో చనిపోయిన వారిలో ఈయనే ప్రధములు. కొందరు ఎంపీలు రాష్ట్రాల మంత్రులు చనిపోయినా కేంద్ర క్యాబినెట్ కి సంబంధించి ఈయన మరణమే మొదటిది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







