శాంతి ఒప్పందంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న బహ్రెయిన్ రాజుకు శుభాకాంక్షల వెల్లువ

- September 24, 2020 , by Maagulf
శాంతి ఒప్పందంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న బహ్రెయిన్ రాజుకు శుభాకాంక్షల వెల్లువ

మనామా:మిడిల్ ఈస్ట్ లో శాంతి స్థాపనకు ఇజ్రాయెల్ తో చారిత్రాత్మక ఒప్పందంపై సంతకం చేసిన బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజ కుటుంబీలతో పాటు షురా మండలి సభ్యులు, ఎంపీలు రాజు నిర్ణయాన్ని స్వాగతిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోని అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ పరస్పర సహకారం చేసుకునేలా రాజు తీసుకుంటున్న ఆదర్శవంతమైన, సాహసవంతమైన నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు వ్యక్తం చేశారు. పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాల వైరాన్ని రూపుమాపేలా చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని రాజు హమద్ తన చిత్తశుద్ధిని చాటుకున్నారని, మధ్య ప్రాచ్యంలో శాంతి స్థాపనకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపకరిస్తుందని, అన్ని దేశాల ప్రజలు శాంతి, భద్రతతో ఉండేందుకు ఒప్పందం దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. 

 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com