ఓ మహిళ ఫిర్యాదుతో అల్ ఖదీసియా నుంచి కార్మికులు, బ్యాచిలర్స్ తరలింపు
- September 28, 2020
షార్జా:ఓ మహిళ ఫిర్యాదుతో షార్జా మున్సిపాలిటీ పరిధిలోని అల్ ఖదీసియా ప్రాంతంలో ఉంటున్న కార్మికులు, బ్యాచిలర్స్ కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. అల్ ఖదీసియాలో ఉంటున్న ప్రతి కార్మికుడు, బ్యాచిలర్ వెంటనే ఖాళీ చేసి అక్కడ్నుంచి వెళ్లిపోవాలంటూ షార్జా రూలర్ ఆదేశాలు జారీ చేశారు. షార్జా రూలర్ ఆదేశాలకు అనుగుణంగా షార్జా మున్సిపాలిటీ అధికారులు చర్యలు ప్రారంభించారు. ఆదివారం నుంచి అల్ ఖదీసియా ప్రాంతంలోని కార్మికులు, బ్యాచిలర్లను ఖాళీ చేయిస్తున్నారు. వారికి ఇళ్లకు అద్దెకు ఇచ్చిన యజమానులకు కూడా నోటీసులు ఇచ్చారు. షార్జా టీవీ, రేడియో ద్వారా దీనిపై ఓ ప్రకటన విడుదల చేశారు. అల్ ఖదీసియా ప్రాంతంలో అద్దెకు ఉంటున్న కార్మికులు, బ్యాచిలర్లు అద్దె నిబంధనలు కూడా ఉల్లంఘించినట్లు తాము గుర్తించామని, షార్జా రూలర్ ఆదేశాల మేరకు
పోలీసులు సహకారంతో అందర్ని అల్ ఖదీసియా ప్రాంతం నుంచి తరలిస్తున్నామని మున్సిపాలిటి ఉన్నతాధికారి తెలిపారు. వలస కార్మికులు, బ్యాచిలర్లకు అల్ ఖదీసియా ప్రాంతంలోనే ఎక్కువగా ఇళ్లు అద్దెకు తీసుకొని ఉంటున్న విషయం తెలిసిందే. దీంతో ఆ ప్రాంతం అంతా వచ్చిపోయే కార్మికులు, బ్యాచిలర్లతో గజిబిజిగా ఉంటుంది. ఆ గజిబిజి వాతావారణం తనకు తన కుటుంబానికి అభద్రత భావం కలిగిస్తోందని ఎమిరాతి మహిళ ఒకరు షార్జా రూలర్ కు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన ఎమిరాతి మహిళల భద్రత తాము ప్రాధాన్యం ఇస్తామంటూ..అల్ ఖదీసియా ప్రాంతంలోని బ్యాచిలర్లను, కార్మికులను వెంటనే ఖాళీ చేయించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







