ఇండియా-దుబాయ్ ప్రయాణికుల కీలక సూచన..భారత్ లోని కొన్ని ల్యాబ్ రిపోర్ట్ లపై నిషేధం
- September 28, 2020
ఇండియా నుంచి దుబాయ్ వెళ్లే ప్రయాణికులకు దుబాయ్ రెగ్యూలేటరీ అథారిటీ కీలక సూచనలు చేసింది. భారత్ లోని కొన్ని ల్యాబరేటరీలు జారీ చేస్తున్న ఆర్టీ-పీసీఆర్ టెస్టులు చెల్లవని తేల్చి చెప్పింది. ఆయా ల్యాబ్ ల వివరాలను తమ అధికారిక ట్విట్టర్ లో విడుదల చేసింది. జైపూర్ లోని సూర్యం ల్యాబ్, కేరళాలోని వివిధ నగరాల్లో ఉన్న మైక్రో హెల్త్ ల్యాబ్ లు, ఢిల్లీలోని డాక్టర్ పీ. భాసిన్ పత్ ల్యాబ్స్ ప్రై. లిమిటెడ్, ఢిల్లీలోని నోబుల్ డైయగ్నోస్టిక్ సెంటర్ నుంచి తీసుకునే ఆర్టీ పీసీఆర్ టెస్టులను తాము పరిగణలోకి తీసుకోబోమని దుబాయ్ రెగ్యూలేటరీ అథారిటీ స్పష్టత ఇచ్చింది. ఇదే విషయాన్ని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ కి కూడా తెలుపుతూ దుబాయ్ వచ్చే ప్రయాణికులు ఆయా ల్యాబుల నుంచి తీసుకొచ్చే ఆర్టీ పీసీఆర్ సర్టిఫికెట్ ను అనుమతించొద్దని, వారు దుబాయ్ ప్రయాణానికి అనర్హులు అని తెలిపింది. ఇదిలాఉంటే ఇండియా నుంచి తమ కింగ్డమ్ కి వచ్చే ప్రతి ప్రయాణికుడు ప్రయాణానికి 96 గంటల్లోగా పరీక్ష చేయించుకున్న ఆర్టీ పీసీఆర్ ఒరిజినల్ రిపోర్ట్స్ ను సమర్పించాలని యూఏఈ ప్రభుత్వం నిబంధన విధించిన విషయం తెలిసిందే. పైన తెలిపిన ఆ నాలుగు ల్యాబ్ రిపోర్టులు సక్రమంగా లేవని..ప్రయాణికులు ఇది గమనించి ఖచ్చితమైన ఫలితాలను వెల్లడించే ల్యాబ్ లలోనే టెస్టులు చేయించుకోవాలని సూచించింది. అయితే..ఇండియా నుంచి కువైట్ వెళ్లే ప్రయాణికులపై దుబాయ్ నిర్ణయం ప్రభావం చూపనుంది. ప్రస్తుతం ఇండియా నుంచి నేరుగా కువైట్ వెళ్లే అవకాశం లేదు. కోవిడ్ నేపథ్యంలో ఇండియాతో పాటు 34 దేశాల ప్రయాణికులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో కువైట్ వెళ్లాలనుకునే ఇండియన్లు ముందుగా దుబాయ్ వెళ్లి అక్కడ 14 రోజుల క్వారంటైన్ లో ఉండి...ఆ తర్వాత కువైట్ చేరుకుంటున్నారు.ఈ నేపథ్యంలో దుబాయ్ మీదుగా కువైట్ వెళ్లే ప్రయాణికులు కూడా ఆ నాలుగు ల్యాబరేటరీలో మినహా ప్రభుత్వం సూచించిన మిగతా ల్యాబోరేటరీలో పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..