ఖతార్:ఐబీపీసీ ఉపాధ్యక్షుడు సుమిత్ మల్హోత్రకు ఆత్మీయ వీడ్కోలు
- September 28, 2020
దోహా:ఖతార్ లోని భారత రాయబార కార్యాలయం ఆధర్వంలో ఉండే ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫిషినల్ కౌన్సిల్-ఐబీపీసీ తమ ఉపాధ్యక్షుడు సుమిత్ మల్హోత్రకు ఆత్మీయ వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా ఐబీపీసీ అభివృద్ధికి ఇండియన్ కమ్యూనిటీకి సుమిత్ మల్హోత్ర చేసిన సేవలను కొనియాడిన ఐబీపీసీ అధ్యక్షుడు అజిమ్ అబ్బాస్ సుమిత్ మల్హోత్రకు ప్రశంస పత్రాన్ని అందించారు. పదేళ్లుగా ఖతార్ లో ఉంటున్న సుమిత్ గోల్స్ 101 సీఈవోగా, జేఎంఎస్ ఖతార్ జనరల్ మేనేజర్ గా సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహించి మంచి గుర్తింపు పొందారు. అయన కార్యదర్శత, ప్రతిభా పాటవాలతో ఐబీపీసీ ఎంతగానో ప్రయోజనం పొందిందని, ఖతార్, ఇండియా మార్కెట్ పై ఆయనకు ఉన్న అపారమైన అవగాహన భారత సమాజంతో వ్యవహారాలు మరింత మెరుగయ్యాయని అన్నారు. ఆయన తన భవిష్యత్తు బాధ్యాతలను మరింత సమర్ధవంతంగా నిర్వహించి..మరింత పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా ఐబీపీసీ కార్యవర్గం ఆత్మీయ వీడ్కోలు పలికింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..