హైదరాబాద్:యువతి ఆత్మహత్య కేసును ఛేదించిన పోలీసులు.. ఇంటి యాజమాని అరెస్ట్
- September 28, 2020
హైదరాబాద్:సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మహిళ ఆత్మహత్య కేసును పోలీసులు ఛేదించారు.అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు తమ విచారణలో నిత్యం వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. యువతి అత్మహత్యకు కారకుడైనా బాతుకు మధుసుధన్ యాదవ్ ను అదునులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు
ఈ కేసుకు సంబంధించిన వివరాలను శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి వెల్లడించారు. మొయినాబాద్ పొలిస్టేషన్ పరిధిలోని హిమయత్ సాగర్ లో భతుకు మధుసుదన్ యాదవ్ ఇంట్లో పని చేస్తున్న ఇద్దరు అక్కాచెల్లెలను తరుచు లైంగిక వేదించేవాడు అతని బాధలు భరించలేక చెల్లెలు ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఈనెల 25వ తేది అత్మహత్య చేసుకుని మృతి చెందింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాగా, మధుసుదన్ ఇచ్చే జీతం డబ్బులను తండ్రికి ఇచ్చే వాళ్ళు ఇద్దరు అక్కాచెల్లెలు. అయితే ఈ నెల 24వ తేది రాత్రి 10గంటలకు పని నిమిత్తం మేడపైకి తీసుకెళ్ళాడు. తెల్లవారే సరికి చెల్లెలు ప్యానుకు ఉరి వేసికుని అత్మహత్య చేసుకుంది. అయితే, తన చెల్లెలు కడుపునొప్పి భరించలేక అత్మహత్య చేసుకుందని చెప్పాల్సిందిగా మృతురాలి అక్కకు మధుసుదన్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మొయినబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని ఉస్మానియా మార్చరీకి తరలించి కేసు నమోదు చెసి దర్యాప్తు చెపట్టారు మధుసుదన్ పెట్టే లైంగికవేధింపులు భరించలేక తన చెల్లెలు చనిపోయిందని అక్కా పొలీసులకు వెల్లడించింది. అక్కా ఇచ్చిన ఫిర్యాదు మేరకు మధుసుదన్ ను అదుపులోకి తీసుకున్న అతనిపై నిర్భయ కేసుతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుడిపై గతంలో మొయినాబాద్ పొలీసుస్టేషన్ లో రౌడిషీట్ ఉన్నట్లు శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి వెల్లడించారు.

తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







