గ్రాడ్యుయేట్ ఓటర్ గా పేరు నమోదు చేసుకున్న టి.హోం మంత్రి

- October 01, 2020 , by Maagulf
గ్రాడ్యుయేట్ ఓటర్ గా పేరు నమోదు చేసుకున్న టి.హోం మంత్రి

హైదరాబాద్:హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ గ్రాడ్యుయేట్డ్  లిస్టులో పేరు నమోదు చేసుకునేందుకు గురువారం నాడు చార్మినార్ ప్రాంతంలోని సర్దార్ మహల్ లో ఉన్న జి హెచ్ ఎం సి డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి  వెళ్లారు.  డిప్యూటీ కమిషనర్ వి.రజనీకాంత్ రెడ్డికి దరఖాస్తు పత్రాలు అందజేశారు. అక్టోబర్ ఒకటవ తేది నుండి నవంబర్ ఆరవ తేదీ వరకు దరఖాస్తు పత్రాలు స్వీకరిస్తున్న నేపథ్యంలో  గ్రాడ్యుయేట్ ఓటర్ల ను చైతన్య పరిచేందుకు  ముందుగా తన పేరు నమోదు చేసుకున్నారు.ఈ సందర్భంగా హోం శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న గ్రాడ్యుయేట్లందరూ తమ పేర్లను నమోదు చేసుకోవడం ద్వారా ఓటు హక్కు పొందవచ్చని, తద్వారా  రానున్న ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవచన్నారు. 2017 వ సంవత్సరం నవంబర్ నెల ముందు  డిగ్రీ పూర్తి చేసి న వారందరూ ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు అర్హులని వారు విధిగా తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. గతంలో నమోదు చేసుకున్నప్పటికీ ఈసారి మళ్లీ నమోదు చేసుకోవాలని మంత్రి తెలియజేశారు. డిగ్రీ పూర్తయిన వారు తమ ఎమ్. ఎల్.సి ని ఎన్నుకునేందుకు ఇది ఒక మంచి అవకాశమని, ఓటు నమోదు చేసుకోవడం ద్వారా తమకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకునేఅవకాశం ఉన్నందున త్వరితగతిన ఓటు నమోదు చేసుకోవాలని హోంమంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com