ట్యూషన్‌కు వెళ్లిన 15 మంది విద్యార్థులకు కరోనా
- October 02, 2020
గుంటూరు జిల్లాలో ప్రైవేట్ క్లాసులు కొంపముంచాయి. మాస్టర్‌కు కరోనా సోకడంతో ట్యూషన్‌కు వెళ్లిన విద్యార్థులంతా కొవిడ్ బారినపడ్డారు. సత్తెనపల్లి మండలం భట్లూరులో 15 మంది చిన్నారులకు కరోనా సోకిందని వైద్యాధికారలు వెల్లడించారు. ట్యూషన్ చెప్పే మాస్టార్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన వద్దకు ట్యూషన్‌కు వెళ్లిన విద్యార్థులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో 15 మంది విద్యార్థులు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. విద్యార్థులంతా ఏడేళ్లలోపు చిన్నారులే కావడం మరింత కలిచివేసింది. వైద్య అధికారులు విద్యార్థులను ఎన్ఆర్ఐ క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. చిన్నారుల తల్లిదండ్రుల్లో కొందరికి కరోనా పాజిటీవ్ రావడంతో అధికారులు హుటాహుటిన ఆ గ్రామంలో సహయక చర్యలు చేపట్టారు. కరోనా లక్షణాలు ఉన్న అందరినీ హోం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు