రిక్రూట్‌మెంట్‌ ఆఫీస్‌ లైసెన్సుల్ని రద్దు చేసిన ఎల్‌ఎంఆర్‌ఎ

- October 02, 2020 , by Maagulf
రిక్రూట్‌మెంట్‌ ఆఫీస్‌ లైసెన్సుల్ని రద్దు చేసిన ఎల్‌ఎంఆర్‌ఎ

బహ్రెయిన్: లేబర్‌ మార్కెట్‌ రెగ్యులేషన్‌ అథారిటీ (ఎల్‌ఎంఆర్‌ఎ), రెండు రిక్రూట్‌మెంట్‌ కార్యాలయాల లైసెన్సుల్ని రద్దు చేసినట్లు ప్రకటించింది. మనీలా మేన్‌ పవర్‌ ఆఫీస్‌ (సల్మానియా) ఒకటి కాగా ఇంకొకటి గ్లోబల్‌ లీడర్స్‌ ఆఫీస్‌ (గుడైబియా). ఈ రెండు కార్యాలయాలతో ఫైనాన్షియల్‌ క్లెయిమ్స్, కాంట్రాక్టులు, ఇతర వ్యవహారాలు కలిగి వున్న క్లయింట్స్‌, మెయిన్‌ హెడ్‌ క్వార్టర్స్‌లోని లైసెన్సింగ్‌ డిపార్ట్‌మెంట్‌ కార్యాలయాల్ని నెల లోపు సంప్రదించాల్సిందిగా ఎల్‌ఎంఆర్‌ఎ విజ్ఞప్తి చేస్తోంది. ఇ-మెయిల్‌ (e-mail: [email protected]) ద్వారా లేదా కాంటాక్ట్‌ నెంబర్స్‌ (17388618 - 17388615) ద్వారా కూడా సంప్రదించవచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com