వేతన ఆవేదన: 105 మంది ఇండియన్‌ వర్కర్స్‌ ఆందోళనపై స్పందించిన పిఎఎం

- October 05, 2020 , by Maagulf
వేతన ఆవేదన: 105 మంది ఇండియన్‌ వర్కర్స్‌ ఆందోళనపై స్పందించిన పిఎఎం

కువైట్: పబ్లిక్‌ అథారిటీ ఆఫ్‌ మేన్‌ పవర్‌ అధికారులు, 105 మంది ఇండియన్‌ వర్కర్స్‌ వేతనాల వేదనపై స్పందించారు. జూన్‌ నుంచి తమకు వేతనాలు అందడంలేదంటూ 105 మంది ఇండియన్‌ వర్కర్స్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. ఈ విషయమై ఇండియన్‌ ఎంబసీకి బాధితులు సమాచారమిచ్చారు. ఎంబసీ అధికారులు, సంబంధిత అథారిటీస్‌తో ఈ విషయమై చర్చించడం జరిగింది. దాంతో పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ మేన్‌ పవర్‌ రంగంలోకి దిగింది. సదరు కంపెనీకి పిఎఎం నోటీలు పంపడం జరిగింది. త్వరలోనే సమస్య పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బాధితుల్లో 99 మంది తమిళనాడుకి చెందినవారు. వీరంతా షుయైబియా పోర్ట్‌లో పనిచేస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com