కారు ప్రమాదం: అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ ఐదుగురు యువకులు
- October 05, 2020
రియాద్: రియాద్‌కి 190 కిలోమీటర్ల దూరంలో షర్కా ప్రాంతంలో కారు వేగంగా దూసుకెళుతూ బోల్తా పడిన ఘటనలో ఐదుగురు యువకులు అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. అల్ తలాతీన్ రౌండెబౌట్ వద్ద కారు ఓవర్‌టర్న్ అయినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ పోలీస్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఘటనలో 75 శాతం తప్పిదం అస్ఫాల్ట్ కారణంగా జరిగిందనీ, 25 శాతం డ్రైవర్ తప్పిదమని తెలుస్తోంది. కారు డ్రైవర్ తండ్రి మొహమ్మద్ అబు బతీన్ మాట్లాడుతూ, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాకపోవడం దేవుడి దయ అని అన్నారు. అస్ఫాల్ట్ సమస్య వల్ల ఇది జరిగిందనీ, సంబంధిత అథారిటీస్ ఈ సమస్యపై దృష్టిపెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







