మరో 3000 పార్కింగ్ స్థలాలను పెయిడ్ పార్కింగ్ గా మార్చిన షార్జా మున్సిపాలిటి
- October 05, 2020
షార్జా:అధునాతన సౌకర్యాలతో పార్కింగ్ వసతులను అభివృద్ధి చేసిన షార్జా మున్సిపాలిటీ..కొన్నాళ్లుగా వాటిని పెయిడ్ పార్కింగ్ గా మారుస్తూ వస్తోంది. ఇందులో
భాగంగా ఇటీవలో 4,100 పార్కింగ్ స్థలాలను పెయిడ్ పార్కింగ్ గా మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇప్పుడు షార్జా మున్సిపాలిటీ పరిధిలోని మరో 3000 పార్కింగ్ స్థలాలను పెయిడ్ పార్కింగ్ జాబితాలో చేర్చింది. మువైలిహ్ 3లో -1,755, అల్ నహ్దా-651, అల్ తావోన్-586 పార్కింగ్ స్థలాలను పెయిడ్ పార్కింగ్ గా మార్చినట్లు షార్జా మునిసిపాలిటీ అధికారులు తెలిపారు. పెయిడ్ పార్కింగ్ స్థలాలన్ని 24 గంటల పాటు వాహనదారులకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. డబ్బు చెల్లించేందుకు టచ్ స్క్రీన్ లతో స్టార్ట్ మీటర్లు ఏర్పాటు చేశామని, అవసరమైతే ఆన్ లైన్ లో కూడా డబ్బు చెల్లించవచ్చని వివరించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు