సివిల్‌ ఐడీ హోం డెలివరీ: పీఎసిఐ అభ్యర్థనకు ఆమోదం

- October 06, 2020 , by Maagulf
సివిల్‌ ఐడీ హోం డెలివరీ: పీఎసిఐ అభ్యర్థనకు ఆమోదం

కువైట్: ఆడిట్‌ బ్యూరో, పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ ఇన్ఫర్మేషన్‌ అభ్యర్థనను ఆమోదించింది. సివిల్‌ ఐడీ కార్డుల్ని హోం డెలివరీ చేయడం కోసం పిఎసిఐ ఈ అభ్యర్థన చేసింది. కాగా, పిఎసిఐ, ఓ ప్రైవేట్‌ వెండర్‌ని ఇందుకోసం సంప్రదించడం జరిగింది. ఒక్కో డెలివరీకి 650 ఫిల్స్‌ ఇచ్చేలా ఏడాది కాలానికి ఈ ఒప్పందం కుదరనుంది. మూడు నెలల్లో ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుంది. కాగా, సివిల్‌ ఐడీ కలెక్షన్‌ సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పెంచింది. సౌత్‌ సుర్రాలోని తమ కార్యాలయంలో ఇది అందుబాటులో వుంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com