ప్రధానితో ముగిసిన ఏపీ సీఎం జగన్ సమావేశం
- October 06, 2020
ప్రధాని నరేంద్రమోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సమావేశం ముగిసింది. దాదాపు 40 నిమిషాలపాటు ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. మోదీ నివాసంలో జరిగిన ఈ ప్రత్యేక సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి అంశాలే అజెండాగా చర్చలు జరిగాయి. విభజన హామీలు, పెండింగ్ నిధులు, ఏపీ ఆర్థిక పరిస్థితిని సీఎం జగన్ ప్రధానికి వివరించారు. జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి కూడా ఉన్నారు. అటు, తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చి ఉందంటున్నారు. త్వరలో ఎన్డీయేలో వైసీపీ చేరుతుందన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ సమావేశం అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దాదాపు ప్రధానితో 8 నెలల తర్వాత జరుగుతున్న భేటీలో సీఎం ప్రత్యేక హోదాపై ప్రధానితో మాట్లాడారా.. కేంద్రం దీనిపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇదిలావుంటే ప్రధానితో భేటీ ముగిసాక 1-జన్‌పథ్‌కు చేరుకున్నారు సీఎం జగన్. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!