మస్కట్ నుంచి ఢిల్లీ, ముంబై, కొచ్చికి విమాన సర్వీసులు పునరుద్ధరించిన ఒమన్ ఎయిర్
- October 06, 2020
మస్కట్ నుంచి భారత్ కు విమాన సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్లు ఒమన్ ఎయిర్ ప్రకటించింది. ఢిల్లీ, ముంబై, కొచ్చి నగరాలకు వారంలో రెండు సర్వీసులను నడపనుంది. భారత్-ఒమన్ మధ్య బబుల్ అగ్రీమెంట్ కుదరటంతో భారత విమానయాన సంస్థలు కూడా ఒమన్ కు సర్వీసులను పున:ప్రారంభించిన విషయం తెలిసింది. ఆక్టోబర్ 7 నుంచి ఇండిగో సంస్థ విమాన సర్వీసులు అందుబాటులో రానుండగా...ఆ మరుసటి రోజు నుంచే ఒమన్ ఎయిర్ సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో రానున్నాయి. అయితే..మస్కట్ నుంచి ఢిల్లీ, ముంబై, కొచ్చికి వారంలో రెండు సర్వీసులను మాత్రమే ఒమన్ ఎయిర్ నడపనుంది.
* మస్కట్ టూ ఢిల్లీ - ప్రతి వారంలో సోమవారం, బుధవారాల్లో సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
*మస్కట్ టూ ముంబై - ప్రతి వారంలో ఆదివారం, గురువారాల్లో సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
* మస్కట్ టూ కొచ్చి - ప్రతి వారంలో ఆదివారం, గురువారాల్లో సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
అయితే..కోవిడ్ నేపథ్యంలో ప్రయాణికులు ఖచ్చితంగా ఆయా దేశాల ప్రభుత్వాలు విడుదల చేసిన మార్గనిర్దేశకాలను అనుసరించాలని అధికారులు తెలిపారు. ప్రతి ప్రయాణికుడు మాస్క్ ధరించటంతో పాటు..విమానం ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది. మస్కట్ రావాలనుకునే ప్రయాణికులు మరిన్ని వివరాల కోసం paca.gov.com, సందర్శించి తగిన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలని కోరారు. అలాగే భారత్ కు వెళ్లే ప్రయాణికులు omanair.com. వెబ్ సైట్ ద్వారా ప్రీ డిపార్చర్ వివరాలను తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు







