ఖతార్ తూర్పు తీరంలో ఉరుములతో కూడిన వర్షాలు-QMD
- October 06, 2020
దోహా:ఖతార్ తూర్పు తీరంలో ఉరుములతో కూడిన వర్షం కురిసినట్లు ఖతార్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు కొనసాగుతుండటంతో స్థానికులు, అటువైపు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వడగళ్ల వానతో పాటు భారీగా ఈదురుగాలులు వచ్చే అవకాశాలు ఉన్నాయని, దుమ్ము కారణంగా దృశ్యమానత తగ్గే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. కనుక వాహనదారులు మరింత అప్రత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. తుపాను ప్రభావంతో అల్ రేయాన్, అల్ హిలాల్, మెసైమీర్, ఐన్ ఖలీద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోందని పేర్కొంది. ఇదిలాఉంటే గురువారం సాయంత్రం నుంచి శనివారం వరకు వాయువ్య దిశగా 15-25kt వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, గరిష్టంగా 30kt వేగాన్ని కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అలల తీవ్రత సాధారణం కంటే 4 నుంచి 8 అడుగుల వరకు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరోవైపు తుపాను ప్రభావంతో రోజు వారి కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతల్లో భారీ హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. మంగళవారం నమోదైన వివరాల ప్రకారం గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం 31 డిగ్రీల నుంచి 35 డిగ్రీల సెల్సియస్ వరకు నమెదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష