యూఏఈ:ఫ్లూ వ్యాక్సిన్ కోవిడ్ 19 నుంచి రక్షించలేదు
- October 07, 2020
యూఏఈ:ఇప్పటికే కోవిడ్ తో వణికిపోతున్న ప్రజలను ఫ్లూ సీజన్ మరింత కంగారు పెడుతోంది. కోవిడ్ 19, ఫ్లూ లక్షణాలు దాదాపుగా ఒకేలా ఉంటాయి కనుక..ప్రజలను అప్రమత్తం చేస్తూ జాతీయ అత్యవసర, విపత్తు నిర్వహణ కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ఫ్లూ, కోవిడ్ 19 వైరస్ సోకే అవకాశాలు ఉన్నాయని, అయితే..రెండింటిలోనూ జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్లునొప్పుల వంటి లక్షణాలే ఉంటాయని వెల్లడించింది. అందువల్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, కేవలం వ్యాధి నిర్ధారణ పరీక్షల ద్వారానే ఫ్లూ సోకిందా..కోవిడ్ వైరస్ అటాక్ చేసిందా అనే విషయం తెలుస్తుందని కమిటీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. అయితే..ఫ్లూని అరికట్టేందుకు వినియోగించే వ్యాక్సిన్ తో కోవిడ్ 19 ను నియంత్రించలేమని కూడా కమిటీ అధికారులు స్పష్టం చేశారు. కానీ, ఫ్లూ వైరస్ ను తట్టుకునే ఇమ్యూనిటీ కోసం వ్యాక్సిన్ వేయించుకోవాలని కూడా సూచించింది. ముఖ్యంగా వైద్య సిబ్బంది, ఐదేళ్లలోపు పిల్లలు, స్మోకర్స్, గర్భిణిలు, వృద్ధులు ఫ్లూ బారిన పడితే ప్రమాదమని, ఆయా వర్గాలు తప్పకుండా ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఇదిలాఉంటే కోవిడ్ 19 వ్యాక్సిన్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని, ఫ్లూ వ్యాక్సిన్ అందుకు ప్రత్యామ్నాయంగా వినియోగించలేమని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష