షుమారు 5 కోట్ల భారీ ట్రాఫిక్ జరిమానాలు..వాహనాల స్వాధీనం..

- October 07, 2020 , by Maagulf
షుమారు 5 కోట్ల భారీ ట్రాఫిక్ జరిమానాలు..వాహనాల స్వాధీనం..

అబుధాబి: ఇద్దరు యూఏఈ వాహనదారుల జరిమానాలు అబుధాబి పోలీసులను ఆశ్చర్యానికి గురిచేశాయి. 2.6 మిలియన్ దిర్హాముల వీరి జరిమానా పెద్ద దుమారమే లేపింది. ఒక డ్రైవర్ 1.4 మిలియన్ దిర్హాముల జరిమానా కట్టగా మరొకరు 1.2 మిలియన్ దిర్హాముల జరిమానా కట్టటం జరిగింది. దీంతో డ్రైవర్ల దూకుడు తగ్గించేందుకు కొత్త రూల్స్ అమల్లోకి తెచ్చింది పోలీసు యంత్రాంగం.

"అబుధాబి రోడ్ల మీద ఏర్పాటు చేసిన రాడార్లు, కెమెరాలను తప్పించుకున్న డ్రైవర్లను పోలీసులు గుర్తించారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి. కొత్త ఇంపౌండ్మెంట్ విధానం ప్రకారం, ట్రాఫిక్ జరిమానాలు 7,000 డాలర్లను మించినట్లైతే, పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకోవటం జరుగుతుంది. మూడు నెలల వరకు జరిమానా కట్టి  క్లెయిమ్ చేసుకోనట్లయితే ఆ వాహనాలను వేలం వేయటం జరుగుతుంది" అని అబుధాబి పోలీసుల ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ సేలం అబ్దుల్లా అల్ ధహేరి తెలిపారు.

కొత్త పాలసీ ఇంపౌండ్మెంట్ ప్రకారం 50,000 దిర్హాముల వరకు జరిమానా విధించదగిన అనేక నేరాల జాబితాను విడుదల చేశారు. ఆకస్మికంగా దారులు మార్చడం, వేగంగా వాహనాలు నడపడం, ఎర్ర ట్రాఫిక్ లైట్లు దూకడం, పాదచారులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, వాహనాల మధ్య తగినంత సురక్షిత దూరం ఉంచకపోవడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి ఆరు ప్రధాన ఉల్లంఘనలను ఈ జాబితాలో చేర్చటం జరిగింది.  2017 నుండి 2020 వరకు ఎమిరేట్‌లో 2,703 పెద్ద ప్రమాదాలు మరియు 215 మరణాలు  నమోదయ్యాయి అల్ ధహేరి పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com