అగర్వాల్ ఆర్ట్స్' చిత్రం ‘రాజ రాజ చోర’

- October 07, 2020 , by Maagulf
అగర్వాల్ ఆర్ట్స్\' చిత్రం ‘రాజ రాజ చోర’

హైదరాబాద్:ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా, యువ కథానాయకుడు శ్రీవిష్ణు  హీరోగా, హసిత్ గోలి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘రాజ రాజ చోర’. మేఘా ఆకాష్,సునయన నాయికలు.  

ఈ చిత్రం షూటింగ్ నేడు పునః ప్రారంభమయింది. షూటింగ్ ప్రారంభించటానికి ముందు స్వర్గీయ ఎస్.పి. బాలు గారికి నివాళులు అర్పించిన అనంతరం ఈ చిత్ర షూటింగ్ కార్యక్రమాలు పునః ప్రారంభించినట్లు తెలిపారు నిర్మాతలు. శ్రీవిష్ణు, హసిత్ గోలి వంటి ప్రతిభ కలిగినవారితో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. ఒక వినూత్నమైన కథతో రూపొందుతున్న  చిత్ర మిదని  నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్ తెలిపారు. కథానాయకుడు శ్రీవిష్ణు, కాదంబరికిరణ్,శ్రీకాంత్ అయ్యంగార్ లు పాల్గొనగా సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హౌస్ లో జరిగింది. ఈ చిత్రం ఈ రోజు నుంచి పూర్తయ్యేవరకు రెగ్యులర్  షూటింగ్ జరుపుకుంటుంది  అని తెలిపారు సహ నిర్మాత వివేక్ కూచి భొట్ల,క్రియేటివ్ ప్రొడ్యూసర్ కీర్తి చౌదరి.  
చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో తనికెళ్ళ భరణి, రవిబాబు,కాదంబరి కిరణ్, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్,వాసు ఇంటూరి   తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వేదరామన్
సంగీతం: వివేక్ సాగర్
ఎడిటింగ్: విప్లవ్ నైషధం
ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె
స్టైలింగ్: శృతి కూరపాటి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: కీర్తి చౌదరి
సహ నిర్మాత: వివేక్ కూచి భొట్ల
నిర్మాతలు: టి.జి.విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్
రచన-దర్శకత్వం: హసిత్ గోలి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com