దుబాయ్:శుక్ర, శనివారాల్లో షిండాఘా టన్నెల్ రోడ్ పాక్షికంగా మూసివేత
- October 08, 2020
దుబాయ్:దైరా నుంచి బుర్ దుబాయ్ వైపే వెళ్లే వాహనదారుల కోసం ఆర్టీఏ అధికారులు కీలక సూచనలు జారీ చేశారు. శుక్ర, శని వారాల్లో అల్ షిండాఘా టన్నెల్ రోడ్డును పాక్షికంగా మూసివేస్తున్నట్లు తమ అధికారిక ట్వీట్టర్ అకౌంట్ ద్వారా వాహనాదారులకు తెలిపారు. శుక్రవారం(అక్టోబర్ 9) అర్ధరాత్రి 12.30 నుండి ఉదయం 10.30 వరకు, శనివారం అర్ధరాత్రి 12.30 నుండి ఉదయం 8 గంటల వరకు సొరంగం మూసివేయబడుతుందని వివరించారు. దీన్ని గమనించి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలుగా అల్ మక్తూమ్ వంతెన, అల్ గర్హౌడ్ వంతెన ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. సొరంగ మార్గం మూసివేత కారణంగా ఆ రూట్లో వెళ్లే కొన్ని బస్సు సర్వీసులు - X13, X02, 8, 95, C01, C03, C07, C09, C18, E306, X23 - ఆలస్యంగా నడిచే అవకాశాలు ఉన్నట్లు ఆర్టీఏ వెల్లడించింది.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..