కోవిడ్ సవాళ్లపై చర్చించేందుకు సమావేశం కానున్న జీసీసీ ఎయిర్ పోర్ట్ ఎగ్జిక్యూటీవ్స్

- October 08, 2020 , by Maagulf
కోవిడ్ సవాళ్లపై చర్చించేందుకు సమావేశం కానున్న జీసీసీ ఎయిర్ పోర్ట్ ఎగ్జిక్యూటీవ్స్

మస్కట్:కోవిడ్ 19 నేపథ్యంలో విమానయాన రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించేందుకు జీసీసీ సభ్య దేశాల్లోని విమానాశ్రయ ప్రతినిధులు త్వరలోనే సమావేశం కానున్నారు.ఇందుకు ఒమన్ వేదిక కానుంది. సమావేశ వివరాలను వెల్లడించిన ఒమన్ విమానాశ్రయ అధికారులు...తమ అధ్వర్యంలో జరుగుతున్న తొలి సమావేశమని తెలిపారు. ఈ సమావేశంలో జీసీసీ సభ్య దేశాల్లోని పలు విమానాశ్రయాల ఉన్నతాధికారులు హజరవుతారని, కోవిడ్ 19 నేపథ్యంలో విమానయాన రంగం ఎదుర్కుంటున్న సవాళ్లపై చర్చించేందుకు ఇది అత్యున్నత వేదికగా ఉండనుందని వివరించారు. ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలతో పాటు భవిష్యత్తు లక్ష్యాలపై ఈ సమావేశం నిర్దేశిస్తుందని ఒమన్ ఎయిర్ పోర్ట్ అధికారులు చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com