నూతన విద్యా పాలసీ-2020తో నాణ్యమైన విద్య- టి.గవర్నర్
- October 09, 2020
హైదరాబాద్: జాతీయ నూతన విద్యా పాలసీ-2020తో ప్రపంచానికి నాణ్యమైన విద్య నిందించే కేంద్రం భారత దేశం నిలుస్తుందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. నూతన విద్యావిధానంతో విద్యార్ధులు ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారుగా కాకుండా ఉద్యోగాల్ని సృష్టించే వారుగా మారే అవకాశం ఉందని అన్నారు. నూతన విధానంతో భారత్ విశ్వగురుగా మారనుందన్నారు. నాణ్యమైన విద్యతో ప్రపంచ పౌరుగా మారే అవకాశం ఉందన్నారు. రప్రపంచ విజ్ఞాన ఖనిగా సూపర్‌పవర్‌గా భారత్‌ను రూపొందించేందుకు అన్నివర్గాల వారు కలిసి రావాలన్నారు. భారతీయ విద్యా సంస్థల ద్వారా ప్రపంచ స్థాయి విద్యనందించ వచ్చని చెప్పారు.
ప్రజలు నూతన విద్యావిఽధానాన్ని విజ్ఞతతో అర్ధం చేసుకోవాలని సూచించారు. నూతన విద్యావిధానాన్ని అమలు పరచడంలో విజ్ఞునులు, మేధావులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రాధమిక స్ధాయిలో విద్యార్ధులు తమ మాతృభాషలో విద్యను అర్ధం చేసుకోవాలన్నారు. జపాన్, జర్మనీ, కొరియా వంటి దేశాలు కూడా విద్యార్ధులకు తమ మాతృభాషల్లోనే విద్యాబోదన చేసి టెక్నాలజీలో లీడర్స్‌గా ఎదిగాయని అన్నారు. మాతృభాషలో విద్యానభ్యసించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని గవర్నర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..