7 నెలల తర్వాత మళ్లీ గృహకార్మికుల నియామకాలకు సౌదీ అనుమతి
- October 10, 2020
రియాద్:దాదాపు ఏడు నెలల ఆంక్షల తర్వాత ఎట్టకేలకు గృహ కార్మికుల నియామకానికి సౌదీ అరేబియా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోవిడ్ 19 నేపథ్యంలో గత మార్చి 16 నుంచి గృహ కార్మికుల నియామకాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే..రోడ్డు రవాణా, జల మార్గం, విమాన ప్రయాణాలకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఇక విదేశాల నుంచి వచ్చే డొమస్టిక్ వర్కర్లకు కూడా ఆమోదం తెలిపింది. ఈ మేరకు కార్మకుల నియామకాల కాంట్రాక్టులకు సంబంధించి సౌదీ మానవ వనరులు, అభివృద్ధి మంత్రిత్వ శాఖ స్పష్టమైన మార్గనిర్దేశకాలను జారీ చేసింది. కాంట్రాక్టులకు సంబంధించి ఈ నెల 31లోగా మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ ముసనేద్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.కొత్త మార్గనిర్దేశకాల ప్రకారం కాంట్రాక్ట్ కాలపరిమితిని 120 రోజులుగా నిర్ణయించారు. ఒకవేళ నిర్ణీత గడువులోగా గృహ కార్మికుల నియామకంలో విఫలం అయితే..కాంట్రాక్ట్ విలువలో 15 శాతం జరిమానాతో మరో 30 రోజుల పాటు గడువు పొడిగిస్తారు. ఇక కాంట్రాక్ట్ ను క్యాన్సిల్ చేసుకున్నా..150 రోజుల గడువులోగా ఏ కారణం చేతనైనా సరే గృహ కార్మికుడు విధుల్లో చేరటం విఫలమైనా కాంట్రాక్ట్ ను రద్దు చేయటంతో పాటు లైసెన్స్ పొందిన సదరు కాంట్రాక్ట్ సంస్థ నిరభ్యంతరంగా కాంట్రాక్ట్ సొమ్మును 20 శాతం జరిమానాతో వినియోగదారుడికి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
ఇదిలాఉంటే..కాంట్రాక్ట్ కుదిరిన తర్వాత తొలి ఆరు రోజుల నుంచి 30 రోజుల మధ్య కాలంలో ఏ కారణం చేతనైనా ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని రిక్వెస్ట్ చేసుకుంటే..కాంట్రాక్ట్ విలువలో ప్రతి వ్యక్తికి 5 శాతం చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుందని మానవ వనరుల మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. ఒకవేళ 31 రోజుల నుంచి 120 రోజుల మధ్య కాలంలో కాంట్రాక్ట్ రద్దుకు విన్నవించుకుంటే 10 శాతం జరిమానా, 121 రోజుల నుంచి 150 రోజుల మధ్య కాలంలో అయితే 15 శాతం జరిమానా చెల్లించాలి. 151 రోజుల తర్వాత అయితే..ఆటోమేటిగ్గా కాంట్రాక్ట్ రద్దు అవుతుంది. ఇక కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే
ప్రయాణికులపై ఆంక్షల కారణంగా భవిష్యత్తులో కాంట్రాక్ట్ లను రద్దు చేయాల్సిన పరిస్థితి వస్తే..అలాంటి సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటికే ఓ సమర్ధవంతమైన ఏజెన్సీని ఏర్పాటు చేశారు. ఈ ఏజెన్సీ అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..