కువైట్:కోవిడ్ నేపథ్యంలో ఆరోగ్య శాఖ కమిటీ సమావేశం..నిర్ణయాలపై సర్వత్ర ఉత్కంఠ

- October 11, 2020 , by Maagulf
కువైట్:కోవిడ్ నేపథ్యంలో ఆరోగ్య శాఖ కమిటీ సమావేశం..నిర్ణయాలపై సర్వత్ర ఉత్కంఠ

కువైట్ సిటీ:దేశంలో కోవిడ్ 19 మరణాలు, ఐసీయూలో కరోనా పేషెంట్ల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో..వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలపై చర్చించేందుకు ఆరోగ్య శాఖ కమిటీ సమావేశంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఈ కమిటీ ఆదివారం సమావేశమై..సోమవారంగానీ, గురువారంగానీ తమ నిర్ణయం వెలువరించే అవకాశాలు ఉన్నాయి. అయితే..కరోనా తీవ్రత నేపథ్యంలో మరోసారి పాక్షిక కర్ఫ్యూ విధించే అవకాశాలు ఉన్నట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. దీంతో కమిటీ నిర్ణయం ఎలా ఉండబోతుందని ప్రజల్లో కొంత ఉత్కంఠ నెలకొంది. కానీ, ఈ ప్రచారాన్ని ఇప్పటికే ఆరోగ్య శాఖ మంత్రి కొట్టిపారేశారు. పలు నివేదికలు, సూచనలు, పరిస్థితుల ఆధారంగానే తగిన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇదిలాఉంటే..కువైట్ లో గత కొద్ది రోజులుగా కోవిడ్ మరణాల రేటు 11 శాతం పెరిగింది. ఇప్పటివరకు 655 మంది మరణించగా..ప్రస్తుతం యాక్టీవ్ కేసులో 139 మంది ఐసీయులో చికిత్స పొందుతున్నారు. వైరస్ తీవ్రత పెరుగుతుండటంతో ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెంచేలా ముందస్తు వ్యాక్సిన్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. కుదిరితే ఈ వారంలోగానీ, లేదంటే ఎట్టిపరిస్థితుల్లో వచ్చే వారంలో వ్యాక్సినేషన్ చేపట్టాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com