ఏపీలో క్రమంగా తగ్గుతున్న కరోనా

- October 11, 2020 , by Maagulf
ఏపీలో క్రమంగా తగ్గుతున్న కరోనా

అమరావతి: ఏపీలో కరోనా కేసులతో పాటు మరణాలు కూడా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 5,210 కరోనా కేసులు నమోదయ్యాయి.  ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి మొత్తం రాష్ట్రంలో 7,55,727కు కరోనా కేసులు చేరాయి. గత 24 గంటల్లో  కరోనాతో 30 మంది మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 6,224 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 46,295 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 7,03,208 మంది రికవరీ అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో 65.69 లక్షల కరోనా టెస్టుల నిర్వహించారు. ప్రకాశం 8, చిత్తూరు 4, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లాలో, గుంటూరు, కడప, విశాఖ జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. అనంతపురం, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com