`పాయిజన్` మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం
- October 12, 2020
హైదరాబాద్:ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్‌విఆర్ మీడియా శోభారాణి తనయుడు రమణని హీరోగా పరిచయం చేస్తూ సిఎల్ఎన్ మీడియా పతాకంపై రవిచంద్రన్ దర్శకత్వంలో కె. శిల్పిక, ప్రవల్లిక నిర్మిస్తోన్న డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ `పాయిజన్`(వర్కింగ్ టైటిల్). సిమ్రన్, సారిక, అర్ఛన, శివణ్య హీరోయిన్స్‌గా నటిస్తుండగా, నటుడు షఫీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం హైదరాబాద్ సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ఈ రోజు ప్రారంభమైంది. తొలి సన్నివేశాన్ని హీరో రమణ, హీరోయిన్స్ సిమ్రన్, సారిక, అర్ఛన, శివణ్యలపై తెరకెక్కించారు దర్శకుడు రవిచంద్రన్. ఈ రోజు నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో..
చిత్ర నిర్మాతలు కె.శిల్పిక, ప్రవల్లిక మాట్లాడుతూ - ఈ కరోనా లాక్‌డౌన్ తర్వాత ఒక కొత్త మూవీని ఎనౌన్స్ చేయడం హ్యాపీగా ఉంది. ఈ చిత్రానికి మంచి సబ్జెక్ట్‌తో పాటు మంచి ఆర్టిస్టులు,టెక్నీషన్స్ తో కూడిన టీమ్ కుదిరింది. తప్పకుండా ఆడియన్స్‌కి ఒక ఫీల్‌గుడ్ మూవీ అవుతుందనే నమ్మకం ఉంది. మమ్మల్ని బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు``అన్నారు.
దర్శకుడు రవిచంద్రన్ మాట్లాడుతూ - `` ఈ మూవీ ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్. ఫ్యాషన్ ఇండస్ట్రీ బ్యాక్‌డ్రాప్‌లో ప్రతిక్షణం ఉత్కంఠభరితంగా సాగుతుంది. శోభారాణి గారు నిర్మాణంలో మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఆమెకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఫ్యాషన్ ఇండస్ట్రీ బ్యాక్‌డ్రాప్ కథ కాబట్టి ఎంతో మంది థియేటర్ ఆర్టిస్టులను ఆడిషన్ చేసి హీరో హీరోయిన్లను ఎంచుకోవడం జరిగింది. ఈ సబ్జెక్ట్‌కి హీరో రమణ పర్‌ఫెక్ట్ చాయిస్. అలాగే ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు బాలా గారి దగ్గర వర్క్ చేసిన సినిమాటోగ్రాఫర్ ముత్తు కుమరన్ గారి విజువల్స్ థ్రిల్ చేస్తాయి. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు``అన్నారు.
సంగీత దర్శకుడు నేహల్ డీజే మాట్లాడుతూ - `` ఈ సినిమాలో టెక్నికల్‌గా ది బెస్ట్ సౌండ్‌ని మీరు ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నారు`` అన్నారు
నటుడు షఫీ మాట్లాడుతూ - `` ఒక మంచి సినిమాలో భాగమైనందుకు హ్యాపీగా ఉంది` అన్నారు.
హీరో రమణ మాట్లాడుతూ - `` సిఎల్ఎన్ మీడియా సంస్థ ద్వారా హీరోగా పరిచయం అవుతున్నందుకు లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలు శిల్పిక, ప్రవల్లిక గారికి, అలాగే సిరాజ్‌గారికి నా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తూనే అనుక్షణం ఉత్కంఠకు గురిచేసే సబ్జెక్ట్. నా బెస్ట్ పెర్‌ఫామెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను`` అన్నారు.
హీరోయిన్స్ సిమ్రన్, సారిక, అర్ఛన, శివణ్య మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకి థ్యాంక్స్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సిరాజ్, ఆర్టిస్ట్ కో ఆర్డినేటర్ మిథిలేష్ తివారి, లొకేషన్ ఇంచార్జ్ పి. వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.
రమణ, షఫీ, సిమ్రన్, సారిక, అర్ఛన, శివణ్య తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫి: ముత్తు కుమరన్,
సంగీతం: నేహల్ డీజే,
ఆర్టిస్ట్ కో ఆర్డినేటర్: మిథిలేష్ తివారి,
లొకేషన్ ఇంచార్జ్: పి. వైష్ణవి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సిరాజ్,
పిఆర్ఓ: వంశీ- శేఖర్,
నిర్మాతలు: కె. శిల్పిక, కె. ప్రవల్లిక,
దర్శకత్వం: రవిచంద్రన్.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!