హైదరాబాద్:ఇంటి ఓనర్ భార్య చేతులు కట్టేసి.. పనిమనిషి దోపిడీ..
- October 12, 2020
హైదరాబాద్:హైదరాబాద్‌లో చోరీలకు పాల్పడుతున్న నేపాల్ గ్యాంగ్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని బీఎన్‌రెడ్డి కాలనీలో వారంరోజుల క్రితం జరిగిన దొంగతనాన్ని చేధించడం జరిగిందని సీపీ సజ్జనార్ తెలిపారు. నేపాల్ దొంగల ముఠాకు చెందిన ముగ్గురిని ఆదుపులోకి తీసుకున్నారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. వారి నుంచి 5లక్షల నగదుతో పాటు.. 3వందల గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాంట్రాక్టర్ గూడూరు మధుసూదన్‌రెడ్డి ఇంట్లో ఈనెల 5న చోరీ జరిగింది. నేపాల్‌కు చెందిన జానకి... మధుసూదన్‌రెడ్డి ఇంట్లో పనిమనిషిగా పని చేస్తోంది. ఐతే ప్లాన్ ప్రకారం ఆహార పదార్ధాల్లో మత్తుమందు కలపడంతో అంతా నిద్రమత్తులోకి వెళ్లారు. మధుసూదన్‌రెడ్డి భార్య తినకపోవడంతో.. అమె చేతులు కట్టేసి మిగతా సభ్యులతో కలిసి దోపిడీకి పాల్పడ్డారు. కేసు దర్యాప్తులో భాగంగా పది టీమ్‌లను ఏర్పాటు చేసి.. వీరిని పట్టుకున్నట్టు సీపీ సజ్జనార్ తెలిపారు. ఎవరినైనా ఇంట్లో పనికి పెట్టుకునేటప్పుడు వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీపీ సూచించారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..