కోవిడ్ నిబంధనల అమలు బాధ్యత లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్ ఫతా అల్ అలికి అప్పగింత
- October 13, 2020
కువైట్ సిటీ:కరోనాను నియంత్రించేందుకు కమిటీ నిర్దేశించిన మార్గనిర్దేశకాలను మరింత కఠినంగా అమలు చేయలనే దృఢనిశ్చయంతో ఉంది కువైట్ ప్రభుత్వం. కోవిడ్ నిబంధనలను సమర్ధవంతంగా అమలు చేసే బాధ్యతను రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్ ఫతా అల్ అలీకి అప్పగించింది. కోవిడ్ నియంత్రణ చర్యలను సమీక్షించేందుకు ప్రత్యేకంగా సమావేశమైన కువైట్ మంత్రి మండలి ఈ నిర్ణయాన్ని వెలువరించింది. ఇక నుంచి అబ్దుల్ ఫతా అల్ అలీ కోవిడ్ కమిటీని లీడ్ చేస్తారని, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలను అమలు చేస్తారని ప్రకటించింది. గతంలో కువైట్ ట్రాఫిక్ చీఫ్ గా విధులు నిర్వహించిన అబ్దుల్ ఫతా అలీ..దేశంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు అరికట్టడంలో సమర్ధవంతమైన అధికారిగా గుర్తింపు పొందారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వందల మంది ప్రవాసీయులపై కోర్టు ద్వారా దేశబహిష్కరణ శిక్షలు పడేలా విధులు నిర్వహించారు. ఇదిలాఉంటే..కోవిడ్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేసేందుకు ముసాయిదా చట్టాన్ని తీసుకురావాలని మంత్రిమండలి గతంలోనే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఫేస్ మాస్కులు ధరించపోయినా, భౌతిక దూరం పాటించకపోయినా కఠిన చర్యలు తీసుకోవటం చట్టం లక్ష్యం.
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







