హైదరాబాద్:భారీ వర్షం.. కేజిన్నర బంగారం కొట్టుకుపోయింది..
- October 13, 2020
హైదరాబాద్:సాయంత్రం పూట హైదరాబాద్ లో భారీ వర్షం కురిస్తే ఇంటికి చేరుకునే వారి కష్టాలు ఇంతింత కాదు. ట్రాఫిక్ జాములు, పొంగి పొర్లుతున్న డ్రైనేజీలు.. నగర జీవికి వర్షం పడుతుందటేనే గుండెళ్లో రైళ్లు పరిగెడతాయి. ఎంత వర్షం అయినా ఏదో విధంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. ఆ ఆరాటంలోనే కేజీన్నర బంగారు ఆభరణాల బ్యాగును పోగొట్టుకున్నాడు బషీర్ బాగ్ గోల్డ్ షాప్‌లో పని చేసే ఉద్యోగి ప్రదీప్. జుబ్లీహిల్స్ రోడ్ నెం. 36లోని మరో గోల్డ్ షాపులో వినియోగదారుడికి చూపించేందుకు ఒకటిన్నర కేజీల బంగారు ఆభరణాలను బ్యాగులో పెట్టుకుని అతడు వెళ్లాడు.
తిరిగి వచ్చే క్రమంలో బ్యాగును కాళ్ల మధ్య పెట్టుకుని బైక్ నడుపుతున్నాడు. ఈ లోపే భారీ వర్షం మొదలైంది. అయినా బంగారం బ్యాగు ఉందని ఎక్కడా ఆగకుండా వెళుతున్నాడు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 వద్దకు వచ్చేసరికి రోడ్డుపై వరద నీరు పొంగి పొర్లుతోంది. అయినా ఆగకుండా బైకును పోనిచ్చాడు. ఈ క్రమంలో నగల బ్యాగు జారి నీటిలో పడిపోయింది. వెంటనే గమనించుకున్న అతడు తిరిగి వెనక్కి వచ్చి చూసుకుంటే బ్యాగ్ కనిపించలేదు. కొద్ది సేపు వెతికినా ఫలితం లేదు. ఈ మేరకు ప్రదీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర







