బెస్ట్ ఎయిర్ పోర్టు అవార్డు ట్రోఫీలను అందుకున్న హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం

- October 13, 2020 , by Maagulf
బెస్ట్ ఎయిర్ పోర్టు అవార్డు ట్రోఫీలను అందుకున్న హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం

హైదరాబాద్: GMR ఆధ్వర్యంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (GHIAL) ఇటీవల ప్రకటించిన ‘బెస్ట్ ఎయిర్ పోర్ట్ బై సైజ్ అండ్ రీజియన్’ మరియు ‘బెస్ట్ ఎయిర్ పోర్ట్ ఇన్ ఎన్విరాన్మెంట్ అండ్ యాంబియన్స్ బై సైజ్’ అవార్డుల ట్రోఫీలను అందుకుంది. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) మార్చిలో ఎయిర్‌పోర్ట్ సర్వీస్ క్వాలిటీ (ASQ) అవార్డులను ప్రకటించగా, వాటిలో హైదరాబాద్ విమానాశ్రయం ఈ అవార్డులను గెల్చుకుంది.  GHIAL ఈ అవార్డులను ఆసియా-పసిఫిక్ ప్రాంతం, 15-25 మిలియన్ ప్యాసింజర్స్ పర్ యానమ్ (MPPA) విభాగాలలో గెల్చుకుంది.

కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ ట్రోఫీలను ఆయా విమానాశ్రయాలకు పంపడం జరిగింది. విమానాశ్రయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రదీప్ పణికర్, సీఈఓ, GHIAL ఈ అవార్డులను ఎయిర్‌పోర్టు భాగస్వాముల మధ్య విమానాశ్రయం తరపున లాంఛనంగా అందుకున్నారు.  

ASQ అనేది ప్రపంచంలోని ప్రముఖ విమానాశ్రయాలలో ప్రయాణీకుల సేవ, విమానాశ్రయం ద్వారా ప్రయాణించేటప్పుడు ప్రయాణీకుల సంతృప్తిని కొలిచే ‘బెంచ్ మార్కింగ్’ కార్యక్రమం.

భారతదేశపు మొట్టమొదటి ఆధునిక, PPP క్రింద అభివృద్ధి చేయబడిన గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం హైదరాబాద్ విమానాశ్రయం. ASQ ప్యాసింజర్ సర్వేలో వరుసగా 9 సంవత్సరాలు (2009 నుండి 2017 వరకు) ప్రపంచ టాప్ 3 విమానాశ్రయాలలో ఒకటిగా ఉంది. ఇటీవల హైదరాబాద్ విమానాశ్రయం సురక్షిత ప్రయాణాన్ని బలోపేతం చేసే దిశగా విమానాశ్రయ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) హెల్త్ అక్రెడిటేషన్‌ను సాధించింది.

స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌పోర్ట్ అవార్డ్స్ 2019లో భారతదేశం/మధ్య ఆసియా విభాగంలో హైదరాబాద్ విమానాశ్రయం బెస్ట్ రీజనల్ ఎయిర్‌పోర్ట్, బెస్ట్ ఎయిర్‌పోర్ట్ స్టాఫ్ సర్వీస్ అవార్డులను కూడా గెలుచుకుంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్ హెల్ప్ ప్యాసింజర్ సర్వే స్కోరు 2019లో ప్రపంచంలోని ఎనిమిదవ ఉత్తమ విమానాశ్రయంగా కూడా ఉంది. మొదటి పది ప్రపంచ విమానాశ్రయాలలో ఉన్న ఏకైక భారతీయ విమానాశ్రయం కూడా హైదరాబాద్ విమానాశ్రయమే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com