సైబరాబాద్ పోలీసులకు చిక్కిన జామ్తారా ముఠా
- October 14, 2020
హైదరాబాద్:పేటీఎం కేవైసీ అప్డేట్ పేరుతో రిమో ట్ యాప్‌లను డౌన్లోడ్ చేయించి.. లక్షలు కాజేస్తున్న జామ్తారా ముఠాను మంగళవారం సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు సభ్యుల ఈ ముఠా దేశవ్యాప్తంగా అమాయకులను బురిడీ కొట్టించి లక్షలు కాజేసింది. మంగళవారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ సజ్జనార్ వివరాలు వెల్లడించారు. మియాపూర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళకు.. ఇటీవల గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెసేజ్ వచ్చింది. అందులో పేటీఎం యాప్ కేవైసీ అప్డేట్ చేసుకోవాలంటే .. ఆ మెసేజ్లోని నంబర్‌ను సంప్రదించాలని ఉంది. దీంతో ఆ మహిళ.. ఆ నంబర్‌కు ఫోన్ చేసింది. అతడు మీ ఫోన్లో టీమ్ వ్యూయర్ క్విక్ సపోర్టు యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండని, ఆ తర్వాత ఆ యాప్ ద్వారా మీ క్రెడిట్, డెబిట్ కార్డుతో మా నంబర్‌కు ఒక్క రూపాయి పంపండి.. మేము మీ పేటీఎంను అప్డేట్ చేసేస్తామన్నాడు. నిజమేనని నమ్మి ఆమె అన్ని వివరాలు చెప్పింది. క్షణాల్లో బాధిత మహిళ బ్యాంకు ఖాతా నుంచి దాదాపు రూ.4.29 లక్షలను కాజేశారు. దీంతో బాధిత మహిళ సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టి.. మోసానికి పాల్పడిన ఐదుగురు సభ్యులు నన్‌కు మండల్, రాజేశ్ మండల్, శివశక్తి కుమార్, గౌరవ్ అరుణ్, దిల్ఖుష్ కుమార్ సింగ్‌లుగా గుర్తించి వారిని జార్ఖండ్ రాష్ట్రం జామ్తారా నుంచి పట్టుకుని వచ్చి మంగళవారం రిమాండ్‌కు పంపారు. సమావేశంలో డీసీపీ రోహిణి ప్రియదర్శిని, అదనపు డీసీపీ కవిత, ఏసీపీ శ్యాంబాబు, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.



తాజా వార్తలు
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!







