కవచం లో రానా హీరోగా..
- February 13, 2016
అందాల రాక్షసి సినిమాతో టేస్ట్ ఉన్న దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న హను రాఘవపూడి. కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో కమర్షియల్ గానూ ఆకట్టుకున్నాడు. దీంతో ఇప్పుడు యంగ్ హీరోల దృష్టి హను రాఘవపూడి మీద పడింది. గతంలో ఇతని కాంబినేషన్ లో సినిమా అనుకొని ఆగిపోయిన హీరోలు కూడా ఇప్పుడు ఆ ప్రాజెక్ట్స్ ను బయటకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.అందాల రాక్షసి తరువాత రానా హీరోగా కవచం పేరుతో సినిమా చేయాలనుకున్నాడు హను రాఘవపూడి. ఈ సినిమాను సురేష్ బాబు, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తారన్న టాక్ వినిపించింది. హను కూడా పక్కా ప్లానింగ్ తో దాదాపు ఏడాదిన్నర పాటు కవచం స్క్రీప్ట్ మీద వర్క్ చేశాడు.కానీ అదే సమయంలో రానా బాహుబలితో బిజీ కావటంతో కవచం సినిమా ఆగిపోయింది.తాజాగా కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కథను కూడా డీల్ చేయగలడని ప్రూవ్ చేసుకున్న హనుతో కవచం సినిమాను తిరిగి ప్రారంభించడానికి రానా ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. అయితే ఈ సారి కూడా బాహుబలి-2 సినిమాతో బిజీగా ఉన్న రానా, ఈ గ్యాప్ లోనే డేట్స్ అడ్జస్ట్ చేస్తాడా..? లేక బాహుబలి-2 పూర్తయ్యాక హను రాఘవపూడితో సినిమా చేస్తాడా చూడాలి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్‌లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









