వారసత్వ యత్నాలకు అవార్డుతో గుర్తింపు- మాజీ మంత్రి

- February 13, 2016 , by Maagulf
వారసత్వ యత్నాలకు అవార్డుతో గుర్తింపు-  మాజీ మంత్రి

వారసత్వాన్ని భద్రపరచడానికి, వ్యక్తిత్వం కాపాడుకోవడానికి ఖతర్ చేసిన ప్రయత్నాలకు గుర్తింపే " 2016 అరబ్ హెరిటేజే పర్సనాలిటీ ఆఫ్ దే ఇయర్ " దక్కించుకోవడం అని మాజీ సాంస్కృతిక శాఖ మంత్రి, యునెస్కోకు కాబోయే సెక్రటరీ జనరల్ అభ్యర్ధి డాక్టర్ హమద్ బిన్ అబ్డులజిజ్ అల్ కువారి తెలిపారు. అబుదాబిలో జరిగిన పర్యాటక మాధ్యమ కేంద్రంలో ఆయన మాట్లాడుతూ, ఖతర్ కు లభించిన ఈ గుర్తింపు కేవలం గౌరవమే కాక ఒక బాధ్యతతో కూడిన నమ్మకమని తెలిపారు. అరబ్ స్థాయిని దేశీయంగానే కాక అంతర్జాతీయ స్థాయిలో నిలపాల్సిఉందన్నారు. తద్వారా  యునెస్కోఖతర్ వారసత్వ సంపదను గూర్చిన ఉన్నతమైన బాధ్యతను ప్రపంచానికి తెలిపినట్లవుతుందని ఆయన అన్నారు. ఎ.సి.టి .ఎం. బహుమతులు పొందిన విజేతలకు వాటిని అందచేయడానికి రానున్న 2 నెలలలో ఏదో ఒక అరబ్ రాజధానిలో ఆ కార్యక్రమాన్ని జరపనున్నట్లు ఆయన పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com