మీ దగ్గర పాత నాణెం ఉంటే.. 25 లక్షలు మీవే..

- October 14, 2020 , by Maagulf
మీ దగ్గర పాత నాణెం ఉంటే.. 25 లక్షలు మీవే..

న్యూ ఢిల్లీ:నాణేలు సేకరించే హాబీ ఉంటే అవి ఇప్పుడు మీకు లక్షలు తెచ్చిపెడతాయి. అయితే ఒక షరతు.. ఆ నాణెం కనీసం వందేళ్ల నాటిది అయి ఉండాలి. పురాతన నాణేలను దేశంలో అతి పెద్ద ఆన్ లైన్ మార్కెట్ సంస్థ ఇండియామార్ట్ వేలం వేస్తుంటుంది. ఒకవేళ మీ వద్ద అలాంటి నాణెం ఉంటే దాన్ని వేలంలో ఉంచి లక్షల రూపాయలు గెలుచుకోవచ్చు. మీ దగ్గర 1913 నాటి రూపాయి నాణెం ఉంటే దాన్ని రూ.25 లక్షలకు వేలం వేయొచ్చు. వెండితో రూపొందిన విక్టోరియా కాలం నాటి ఈ నాణేల ధరను ఇండియామార్ట్ పై రూ.25 లక్షలుగా నిర్ణయించారు. 18వ శతాబ్ధం నాటి నాణెం ధరను రూ.10 లక్షలుగా నిర్ణయించగా, 1818లో ఈస్టిండియా కంపెనీ తయారు చేసిన నాణెం ఖరీదును ఇండియామార్ట్ పై రూ.10 లక్షలుగా ఖరారు చేశారు. ఈ అరుదైన పురాతన నాణెంపై హనుమాన్ ఫోటో ముద్రితమై ఉంటుంది. మీరు మీ దగ్గర ఉన్న నాణేలను విక్రయించదలిస్తే ఇండియా మార్ట్. కాంను సంప్రదించవచ్చు. ఈ వెబ్ సైట్ లో మీరు అకౌంట్ ఓపెన్ చేసి మీ పేరు నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ తర్వాత మీ వద్దనున్న నాణేలను అప్ లోడ్ చేసి వాటిని సేల్ లో ఉంచవచ్చు. పురాతన నాణేలు సేకరించే వారు ఎంతైనా చెల్లించి కొనడానికి సిద్ధంగా ఉంటారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com