మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- September 22, 2025
మనామా: మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్ కు పాల్పడిన వారికి ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. అక్రమ మార్గాల్లో సంపాదించిన 38వే ల బ్రహెయిన్ దినార్లకు పైగా మసాజ్ పార్లర్ పేరుతో విదేశాలకు తరలించినట్లు జనరల్ మేనేజర్ ఆరోపణల ఎదుర్కొంటున్నాడు. అనేక మంది ఆసియా పెట్టుబడిదారులు ఉన్న ఈ హై-ప్రొఫైల్ మనీలాండరింగ్ కేసులో అక్టోబర్ 14న ఫైనల్ తీర్పును వెలువరించేందుకు ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు షెడ్యూల్ చేసింది.
పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకారం, మరణించిన సహచరుడితో పాటు నిందితులు 2019 - 2023 మధ్య బహ్రెయిన్‌లో మసాజ్ పార్లర్ల నెట్‌వర్క్‌ను నిర్వహించారు. వ్యభిచార కార్యకలాపాల నుండి వచ్చే నగదు, కార్డ్ చెల్లింపులను సేకరించడానికి ఈ సంస్థలను ఒక వేదికగా ఉపయోగించుకున్నారని అధికారులు గుర్తించారు. ఆ తర్వాత వచ్చిన మొత్తాన్ని బ్యాంకు బదిలీలు, కరెన్సీ ఎక్స్ఛేంజీల ద్వారా దేశం దాటించారు. ఆ కేసులో ఒక్కొక్కరికి రెండు సంవత్సరాల జైలు శిక్ష పడింది. అయితే, మనీ లాండరింగ్ కు సంబంధించిన కేసులో కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం