నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్‌.. కఠిన చర్యలు..!!

- September 22, 2025 , by Maagulf
నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్‌.. కఠిన చర్యలు..!!

కువైట్: కువైట్ లో బ్యాచిలర్ హౌజింగ్ పై చర్యలు తీసుకుంటున్నారు. నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్ వంటి ప్రతికూల ప్రభావాలను తొలగించాలని ఫర్వానియా గవర్నర్ షేక్ అత్బీ అల్-నాసర్ ఆదేశించారు. ప్రపంచ ప్రమాణాలు, పట్టణ విస్తరణకు అనుగుణంగా మునిసిపల్ సేవలను అందజేయాలని సూచించారు. 

తన కార్యాలయంలో ఫర్వానియా మునిసిపాలిటీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ నవాఫ్ అల్-కందారితో ఫర్వానియా గవర్నర్ సమావేశమయ్యారు. వారితాపాటు అత్యవసర బృందం అధిపతి ఇంజనీర్ మొహమ్మద్ అల్-జబా, బ్యాచిలర్స్ కమిటీ రిపోర్టర్ ఇంజనీర్ మొహమ్మద్ అల్-జలావితో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సంస్థలతో సహకారాన్ని పెంపొందించడం, గవర్నరేట్ అంతటా కువైట్ మునిసిపాలిటీ సేవలకు సంబంధించిన కీలక అంశాలను చర్చించచారు.  కొన్ని ప్రాంతాలను ప్రభావితం చేసే అడ్డంకులు మరియు సమస్యలను అధిగమించడానికి ఆచరణాత్మక పరిష్కారాలను కనుగొనడంపై ఈ సమావేశం ఫోకస్ చేసిందన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com