తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- September 22, 2025
తెలంగాణ నుంచి మరో రెండు వందేభారత్ రైళ్లు పరుగులు తీయనున్నాయి. నాంపల్లి- పుణె, చర్లపల్లి-నాందేడ్ మధ్య ఈ కొత్త రైళ్లు నడుస్తాయి. నాంపల్లి-పుణె మధ్య వందేభారత్ రైలు సర్వీసును తీసుకురావాలని ఇటీవలే ప్రతిపాదన వచ్చింది.
దానికి రైల్వే బోర్డు ఆమోదముద్ర వేసింది. అదే సమయంలో చర్లపల్లి-నాందేడ్ మధ్య కూడా వందేభారత్ రైలును పట్టాలు ఎక్కించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ నుంచి ఇప్పటికే 5 వందేభారత్ రైళ్లు నడుస్తుండగా ఇప్పుడు మరో రెండు చేరనుండడంతో ఆ సంఖ్య ఏడుకి చేరుతుంది.
ప్రస్తుతం ఉన్న వందేభారత్ సర్వీసులు ఇవే
హైదరాబాద్ నుంచి విశాఖకు 2
హైదరాబాద్ నుంచి తిరుపతి, బెంగళూరు, నాగపూర్‌కు ఒక్కోటి చొప్పున
ఈ మార్గాల మధ్య ప్రయాణికులు అధికం. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి 600 కిలోమీటర్లు లేదా అంతకుమించి దూరం ఉన్న ప్రాంతాలకే ఈ రైళ్ల సర్వీసులు ఉన్నాయి. కొత్తగా మంజూరైన హైదరాబాద్-నాందేడ్ సర్వీసు మధ్య 281 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది.
నాందేడ్‌లోని వ్యాపారులకు తెలంగాణతో వాణిజ్య సంబంధాలు బాగా ఉంటాయి. అలాగే, హైదరాబాద్-నాందేడ్ మార్గంలో నిజామాబాద్ పట్టణం ఉంటుంది. దీంతో అక్కడి వారికి కూడా బాగా ఉపయోగపడుతుంది. హైదరాబాద్ నుంచి పుణ్యక్షేత్రం బాసరకు కూడా చాలా మంది వెళ్తుంటారు.
కొత్తగా హైదరాబాద్-పుణె మధ్య కూడా వందేభారత్ రైలు మంజూరైంది. ఈ నగరాల మధ్య 592 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ రూట్లో ప్రయాణికుల రాకపోకలు కూడా బాగా ఉంటాయి.
తాజా వార్తలు
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్‌లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక
- ఇజ్రాయెల్‌లో భారీ భూకంపం..
- UAE నిపుణుల హెచ్చరిక: ‘నిశ్శబ్ద వేధింపులు’ ఎక్కువ ప్రమాదకరం







